Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల కేసులో చిన్న ఉద్యోగులపైనే చర్యలా!

Bellampalli: బెల్లంపల్లి నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంలో చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకుని కాంగ్రెస్ నేతలను వదిలేశారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 23 Nov 2026 12:30 PM IST
Bellampalli
X

Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల కేసులో చిన్న ఉద్యోగులపైనే చర్యలా!

Bellampalli: బెల్లంపల్లి నియోజకవర్గంలో వెలుగుచూసిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంలో చిన్నపాటి ఉద్యోగులను సస్పెండ్ చేసి, అసలు కారణమైన కాంగ్రెస్ నాయకులను వదిలేశారని ఆరోపించారు. బెల్లంపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కింది స్థాయి ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలైన బాధ్యులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు మండలానికొక ఎమ్మెల్యే అన్నట్లుగా వ్యవహరిస్తూ భూకబ్జాలకు పాల్పడుతున్నారని చిన్నయ్య ఆరోపించారు. పట్టణంలో అడుగడుగునా భూముల ఆక్రమణలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలను కూడా దుర్గం చిన్నయ్య తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఘాటైన పదజాలంతో విమర్శలు చేస్తూ, రాజకీయంగా ఆయన వ్యాఖ్యల స్థాయిని ప్రశ్నించారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం, భూకబ్జాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.