Asifabad: ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ లోగో ఆవిష్కరణ!

Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ లోగోను కాగజ్‌నగర్ డీఎస్పీ ఎండీ వాహిదుద్దీన్, రూరల్ సీఐ కుమారస్వామి ఆవిష్కరించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 13 Nov 2026 6:19 PM IST
Asifabad
X

Asifabad: ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ లోగో ఆవిష్కరణ!

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. శివకుమార్ ఆధ్వర్యంలో ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ లోగోను MD వాహిదుద్దీన్ డీఎస్పీ కగజ్ నగర్,కుమారస్వామి రూరల్ సీఐ సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసి, సైన్యంలో సేవలందించిన మాజీ సైనికులు పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులకు పోలీసులకు నేరుగా తెలియజేయలేని సమస్యలు, ఇబ్బందులు ఏవైనా ఉంటే తమ అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు.

అలాంటి సమస్యలను సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సమక్షంలో చర్చించి చట్టపరిధిలో పరిష్కారమయ్యేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, యువతకు దేశభక్తి భావనను కల్పించడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి సామాజిక కార్యక్రమాలకు అసోసియేషన్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

దేశ సేవలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన మాజీ సైనికులు ఇప్పుడు సమాజ సేవలోనూ ముందుండటం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పోలీసు శాఖకు, మాజీ సైనికుల సంఘానికి మధ్య మరింత సమన్వయం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పీయూష్ మండల్ జనరల్ సెక్రెటరీ సునీల్ మండల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుశాంత్ బుర్మాన్, P. శివ, ఉత్తమ్, సంజిత్ రాయ్, నరేంద్ర యాదవ్, పురుషోత్తం, రాబిన్ హోల్డర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR