Asifabad: డబ్బా గ్రామంలో రసవత్తరంగా ముగిసిన కబడ్డీ టోర్నమెంట్!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో జై భవానీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్లో అందవెల్లి జట్టు ప్రథమ విజేతగా నిలిచింది.
Asifabad: డబ్బా గ్రామంలో రసవత్తరంగా ముగిసిన కబడ్డీ టోర్నమెంట్!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామం ఎక్స్ రోడ్ వద్ద జై భవానీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ 4 రోజులుగా రసవత్తరంగా, హోరాహోరీగా సాగింది. చుట్టుపక్కల గ్రామాల నుండి జట్లు పాల్గొని తమ సత్తా చాటాయి.
ఫైనల్ మ్యాచ్ లో అందవెల్లి, జై భవానీ జట్లు తలపడగా నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగింది. చివరకు ప్రథమ విజేతగా అందవెల్లి జట్టు ద్వితీయ విజేతగా జై భవానీ జట్టు నిలిచాయి. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
మొదటి బహుమతి రూ.12,000 నగదును బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అందవెల్లి జట్టుకు అందించారు. రెండవ బహుమతి రూ.8,000* నగదును డబ్బా గ్రామ సర్పంచ్ డోంగ్రి సంతోష్ జై భవానీ యూత్ జట్టుకు అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు.
క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, జట్టుగా కలిసి పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కబడ్డీ మన మట్టి నుండి పుట్టిన క్రీడ అని, దీనిని గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్లు గ్రామాల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
అంతకు ముందు గత నాలుగు రోజులుగా క్రీడా కారులకు ప్రేక్షకులకు బోజనాల ఏర్పాటు కొరకు 1వ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అంగోళ్ల చిలుకయ్య 1క్వింటాల్ బియ్యం అందించగా SRS యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ కూరగాయలు అందించారు. దీంతో పాటు ఫైనల్ మ్యాచ్ లో బాగంగా చిలుకయ్య శ్రీనివాస్ క్రీడా కారులకు బ్రేక్ ఫాస్ట్ సమోసా అందించగా సివిల్ ఇంజనీయర్ అదే రాజు అరటి పండ్లు అందించారు.
ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి గ్రామ పెద్దలు వ్యాపార వేత్తలు దాతలు అంగోలా రమేష్ రెండు సీల్స్ అందించగా ఆడేపల్లి ఉపసర్పంచ్ వ్యాపార వేత్త అధికం మహేశ్ గౌడ్ పుప్పాల శ్రీనివాస్ అడప శ్రీనివాస్ పులబోయిన సచిన్ వార్డు సభ్యులు అద్దాల శ్రీకాంత్ టోర్నమెంట్‌ని ర్వహణ ఖర్చుల కోసం ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించారు.
వారందరికీ జై భవానీ యూత్ అధ్యక్షుడు కొంపరి అంజన్న యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామ్టెంజీ దేవాజి ఉపసర్పంచ్ మౌనిక వరప్రసాద్ గ్రామ యువకులు గ్రామ పెద్దలు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




