Bellampalli: పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన..నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్!

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ స్టేషన్ ఎదుట రైతుల నిరసన. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్.

PRATHAP, BELLAMPALLI
Published on: 10 Oct 2026 1:04 PM IST
Bellampalli
X

Bellampalli: పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన..నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్!

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి, పెరికపల్లి గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొంటూ బెల్లంపల్లి సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. పంటలు ఎండిపోయే దశలో ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా సరిగా అందడం లేదని, దీనివల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొంతకాలంగా రోజువారీ వ్యవసాయ అవసరాలకు ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారుల నుంచి స్పందన లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, తక్షణమే మెరుగైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని లేనియెడల ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI