Asifabad: సిర్పూర్ (టి)లో అగ్నిప్రమాదం: ఇల్లు కాలి బూడిద

Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) దుబ్బగూడలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమై సిలిండర్ పేలింది. రూ.5.50 లక్షల నగదు, బంగారం బూడిదయ్యాయి.

LALITH KUMAR, SIRPUR
Published on: 9 Nov 2026 3:00 PM IST
Asifabad
X

Asifabad: సిర్పూర్ (టి)లో అగ్నిప్రమాదం: ఇల్లు కాలి బూడిద

కోమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లా సిర్పూర్ (టి) దుబ్బగూడ కాలనీలో ఎల్ములే మోహన్ ఇంట్లో సోమవారం షాట్ సర్క్యూట్ తో. అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ.5.50 లక్షల నగదు, ముప్పావు తులం బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయి.

పిల్లల చదువుల ఫీజు కోసం అప్పు తెచ్చిన రూ.1.80 లక్షలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో ఉన్న సిలిండర్ పేలడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు.

సర్పంచ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించగా, ఎస్ఐ వెంకటేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, సమాచారం ఇచ్చిన గంట తర్వాత ఫైర్ ఇంజన్ రావడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR