Nennela: బొక్కలవాగు ప్రాజెక్టులో భారీ చేపల వేట.. 20 కిలోల బొచ్చెకు రూ.5 వేలు!

Nennela: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొక్కలవాగు ప్రాజెక్టులో జాలర్ల పంట పండింది. మంచెర్ల సాయి వలకు 20 కిలోల భారీ బొచ్చె చేప చిక్కగా రూ.5 వేల ధర పలికింది.

PRATHAP, BELLAMPALLI
Published on: 16 Nov 2026 10:48 AM IST
Nennela
X

Nennela: బొక్కలవాగు ప్రాజెక్టులో భారీ చేపల వేట.. 20 కిలోల బొచ్చెకు రూ.5 వేలు!

Nennela: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామ సమీపంలోని బొక్కలవాగు ప్రాజెక్టులో మత్స్యకారుల పంట పండింది. చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలలకు భారీ సైజు చేపలు చిక్కడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఒక్కొక్కటి 10 నుంచి 20 కిలోల బరువున్న భారీ చేపలు లభించాయి.

ముఖ్యంగా మంచెర్ల సాయి అనే జాలరి వలకు ఏకంగా 20 కిలోల బరువున్న భారీ బొచ్చె చేప చిక్కింది. ఈ చేపకు మార్కెట్లో రూ.5 వేల ధర పలికింది. మరోవైపు కంపెల మల్లేశ్, మేడి సంపత్, బింగి భీమేశ్‌తో పాటు ఇతర జాలర్ల వలలకు సుమారు 16 కిలోల బరువున్న మరో నాలుగు భారీ చేపలు చిక్కాయి.

ఒకేసారి ఇన్ని భారీ చేపలు వలకు చిక్కడం ఇదే మొదటిసారని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బొచ్చె, రవు, మెరిగె రకాలకు చెందిన సుమారు ఆరు క్వింటాళ్ల చేపలు లభించినట్లు తెలిపారు. భారీ చేపల విషయం తెలుసుకున్న స్థానికులు, కొనుగోలుదారులు వాటిని చూసేందుకు ప్రాజెక్టు వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పలువురు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. భారీగా చేపలు లభించడంతో నందులపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చేపల కూర ఘుమఘుమలతో గ్రామమంతా సందడిగా మారింది.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI