Kaoutala: సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి!

Kaoutala: కౌటాలలో మాజీ మంత్రి హరీష్ రావు సభకు పకడ్బందీ ఏర్పాట్లు: సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.

SRINIVAS, KOUTALA
Published on: 3 Sept 2026 6:53 PM IST
Kaoutala
X

Kaoutala: సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి!

Kaoutala: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని రేపు అనగా 4వ తేదీన బిఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కౌటాల మండలానికి విచ్చేయనున్న సందర్భంగా కౌటాలలో సభా స్థలాన్ని సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ రావు పరిశీలించారు.

సమావేశానికి విచ్చేసే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక నాయకులకు సూచించారు. సభా ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story