Bejjur: అనాథ పిల్లలకు కొండంత అండగా నిలిచిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే!

Bejjur: జ్జూర్ మండలంలో అనాథలైన పిల్లలకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రూ.1 లక్ష స్కాలర్‌షిప్ ప్రకటించి, పెళ్లి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

SRINIVAS, KOUTALA
Published on: 29 July 2026 11:50 PM IST
Bejjur
X

Bejjur: అనాథ పిల్లలకు కొండంత అండగా నిలిచిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే!

బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆర్థిక చేయూత ప్రకటించారు. బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామపంచాయతీ రేచిని గ్రామానికి చెందిన ఆదె భీమ్రావు, తిరుపతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

వారి పిల్లలు అనాథలు కావడంతో విషయం తెలుసుకున్న సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప బుధవారం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ అమ్మాయి చదువు కోసం నెలకు 2000 రూపాయల చొప్పున 50 నెలల పాటు మొత్తం లక్ష రూపాయలను బిఆర్ఎస్ తరఫున స్కాలర్షిప్ అందిస్తామని హామీ ఇచ్చారు.

పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అంతేకాకుండా అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత వివాహ ఖర్చుల పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని ప్రకటించారు.అనాథలకు అండగా ఉండటం మనందరి బాధ్యత. పార్టీ తరఫున వీరికి ఎల్లవేళలా అండగా ఉంటాం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story