Asifabad: కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెడికల్ క్యాంప్!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.

SRINIVAS, KOUTALA
Published on: 10 Sept 2026 8:24 PM IST
Asifabad
X

Asifabad: కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెడికల్ క్యాంప్!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీ యుపిఎస్ పాఠశాలలో బుధవారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. వసుంధర హాస్పిటల్, కౌటాల వారి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేపట్టారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది విద్యార్థుల బ్లడ్ గ్రూప్‌లను పరీక్షించి, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు అందించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి సహకరించి, వసుంధర హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

విద్యార్థులకు ఉపయోగకరంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువ నాయకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story