Mancherial: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Mancherial: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, మేయర్ దర్ని మధుకర్ నివాళులర్పించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Oct 2026 11:03 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Mancherial: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి మేయర్ దర్ని మధుకర్, కమిషనర్ జి. అన్వేష్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను, అహింసా మార్గంలో స్వాతంత్ర్య సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని మేయర్ దర్ని మధుకర్ సూచించారు.

కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.