Kagaznagar: కాగజ్‌నగర్‌లో గ్యాస్ లీక్ అగ్ని ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

Kagaznagar: కాగజ్‌నగర్ వెల్కమ్ హోటల్‌లో గ్యాస్ సిలిండర్ లీక్‌తో అగ్ని ప్రమాదం. ఐదుగురు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.

LALITH KUMAR, SIRPUR
Published on: 21 April 2026 10:56 AM IST
Kagaznagar
X

Kagaznagar

Kagaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వెల్కమ్ హోటల్‌లో తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి, హోటల్‌లో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

డాక్టర్ల సమాచారం ప్రకారం, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story