Chennur: ఉత్తరవాహినికి పోటెత్తిన భక్తులు.. తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు
Chennur: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ గోదావరి ఘాట్లకు భక్తులు పోటెత్తారు.
Chennur: ఉత్తరవాహినికి పోటెత్తిన భక్తులు.. తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు
Chennur: భక్తులు అధిక సంఖ్యలో గోదావరి నది లో పుణ్యస్నానాలు ఆచరిస్తుండడంతో ఆ పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తొలి ఏకాదశి రోజున పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు అనంతరం శ్రీమహావిష్ణువును దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
కుటుంబ సమేతంగా నదీ తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు, దీపారాధన, ఉపవాసాలు నిర్వహిస్తుంటారు. అనంతరం, వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వారి కుటుంబంలో ఎలాంటి బాధలు కలగకుండా, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వేడుకుంటున్నారు.
తొలి ఏకాదశి పర్వదినం రోజున ఆ మహావిష్ణువును దర్శించుకుంటే పాపాలు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చెన్నూరు పట్టణంలో ప్రవహిస్తున్న గోదావరి నదికి పంచకోష ఉత్తరవాహినిగా పేరు.
ఈ పంచకోష ఉత్తరవాహినిలు పుణ్యస్నానాలు ఆచరిస్తే వారణాసిలోని గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించినట్టుగా పెద్దలు చెబుతుంటారు. కాశీలోని గంగానది ఎలాగైతే దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుందో అలాగే చెన్నూరులో గోదావరి నది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తుంది.
అందుకే చెన్నూరు గోదావరి నదికి ఉత్తరవాహినిగా పేరుగాంచింది.




