Mancherial: చెన్నూరులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి!
Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రాయపేట వద్ద గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను చెన్నూరు పోలీసులు సీజ్ చేశారు.
Mancherial: చెన్నూరులో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడి!
మంచిర్యాల: గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో గోదావరి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను పట్టుకున్న చెన్నూర్ పోలీసులు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయుచున్న పోలీసులకు అందిన సమాచారం మేరకు గోదావరి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లను చెన్నూర్ మండలం రాయపేట వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్స్ మరియు ఓనర్స్ లపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగినదని పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్ ఐ శ్యాంపటేల్ తెలిపారు.
ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడటమే గాక ట్రాక్టర్ MV యాక్ట్ ప్రకారం డ్రైవర్ ల లైసెన్స్ రద్దు చేయించడం మరియు ట్రాక్టర్ లను మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు.
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం నేరమని ఇలా అక్రమాలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెన్నూరు సిఐ బన్సీలాల్ హెచ్చరించారు.




