Mancherial: బెల్లంపల్లి సాఫ్ట్వేర్ కంపెనీని సందర్శించిన జన్నారం విద్యార్థినులు!
Mancherial: జన్నారం ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు బెల్లంపల్లిలోని వాల్యూపిచ్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ సంస్థను సందర్శించి ఐటీ రంగంపై అవగాహన పెంచుకున్నారు.
Mancherial: బెల్లంపల్లి సాఫ్ట్వేర్ కంపెనీని సందర్శించిన జన్నారం విద్యార్థినులు!
Mancherial: విద్యార్థి దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించడంతో పాటు.. భవిష్యత్తులో ఐటీ రంగంలో రాణించేందుకు విద్యార్థినులకు పారిశ్రామిక పర్యటనలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థినులు బెల్లంపల్లిలోని వాల్యూపిచ్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ సంస్థను సందర్శించారు.
సందర్శించారు.కార్యాలయ వాతావరణం,ఉద్యోగుల పనితీరు, వివిధ రకాల ప్రాజెక్టులుమరియు ఐటీ రంగంలో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలను విద్యార్థినులు ప్రత్యక్షంగా తిలకించారు.సంస్థ మేనేజర్ ఆదర్శ్ వర్ధన్ రాజు విద్యార్థినులతో మాట్లాడి, సంస్థ కార్యకలాపాలు, ప్రాజెక్టుల తీరుతెన్నులు మరియు ఐటీ/ ఐటీఈఎస్ రంగాల ప్రాముఖ్యతను వివరించారు.
విద్యార్థినులకు సాంకేతిక రంగంపై ప్రాథమిక అవగాహన కల్పించి, భవిష్యత్తులో వారు సరైన కెరీర్ను ఎంచుకోవడానికి ఈ పర్యటన ఎంతగానోదోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆదర్శ్వ ర్ధన్ రాజు, అడ్మిన్ సుధాకర్, నెట్వర్కింగ్ఇం జినీర్ రామసాగర్, మహేష్ తో పాటు: ప్రధానోపాధ్యాయులు గొల్ల రామన్న, ఉపాధ్యాయులు పద్మజ, సుధాకర్, శ్రావతి, ఐటీఎస్ ఇన్చార్జ్ సునీత. తదితరులు పాల్గొన్నారు. కార్యాలయ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యార్థినులు సాంకేతిక రంగంపై అవగాహన పెంచుకున్నారు. భవిష్యత్తులో సరైన కెరీర్ను ఎంచుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.




