Mancherial: ఆదివాసీ యువకులపై దాడి.. ఫారెస్ట్ అధికారిపై వేటు!
Mancherial: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇంధన్‌పల్లి ఇంచార్జ్ ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ బి. ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Mancherial: ఆదివాసీ యువకులపై దాడి.. ఫారెస్ట్ అధికారిపై వేటు!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇంధన్‌పల్లి ఇంచార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ బి. ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు రోజుల క్రితం జన్నారం మండలం ఇంధన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడకు చెందిన ఆరుగురు ఆదివాసి యువకులు అడవిలో చేపల వేటకు వెళ్లగా, వారిపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
బాధిత ఆదివాసి యువకులకు మద్దతుగా ఆదివాసి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే కూడా ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఆదివాసులపై దాడి చేయడాన్ని ప్రశ్నించారు. ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా, ప్రాథమిక విచారణలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. దీంతో కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ బి. ప్రభాకర్ ఇంధన్‌పల్లి ఇంచార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




