Kagaznagar: కాగజ్‌నగర్ జేఎన్‌వీలో రూ.10 లక్షలతో వెయిటింగ్ హాల్ నిర్మాణం!
Kagaznagar: కాగజ్‌నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థి అల్లాడి శ్రీనివాస్ రూ.10 లక్షలతో తల్లిదండ్రుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్‌ను నిర్మించి విరాళంగా అందించారు.
Kagaznagar: కాగజ్‌నగర్ జేఎన్‌వీలో రూ.10 లక్షలతో వెయిటింగ్ హాల్ నిర్మాణం!
Kagaznagar: తాను చదువుకున్న విద్యాసంస్థపై ఉన్న మమకారంతో ఓ పూర్వ విద్యార్థి తన ఉదారతను చాటుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సౌకర్యార్థం రూ.10 లక్షల వ్యయంతో ప్రత్యేక వెయిటింగ్ హాల్‌ను నిర్మించి పాఠశాలకు విరాళంగా అందించారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నాలుగో బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి అల్లాడి శ్రీనివాస్ ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం యెట్టాఫ్లెక్స్ ఏఐ టెక్నాలజీస్ కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈఓగా కొనసాగుతున్న ఆయన, తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నిర్మించిన వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వెయిటింగ్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు.
తనకు విద్యాబుద్ధులు నేర్పిన విద్యాసంస్థను మరచిపోకుండా, పూర్వ విద్యార్థి అల్లాడి శ్రీనివాస్ రూ.10 లక్షల విలువైన వెయిటింగ్ హాల్‌ను విరాళంగా అందించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.




