Kagaznagar: ఎల్నినో ప్రభావం – ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సరసాలలో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 13 Nov 2026 2:28 PM IST
Kagaznagar
X

Kagaznagar: ఎల్నినో ప్రభావం – ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

కాగజ్‌నగర్: ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సరసాల గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తక్కువ నీటితో సాగు చేసుకునే పెసర, మినుము, శనగ, జొన్న, మొక్కజొన్న, నువ్వులు తదితర పంటలను ఎంచుకోవాలని ఏఈఓ దుర్గ భవాని రైతులకు వివరించారు.

వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో పంట నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సరసాల గ్రామ సర్పంచ్ కొండగుర్ల ప్రకాష్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR