Kagaznagar: లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సేవలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే!

Kagaznagar: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఉచిత వైద్య సేవలందించే 'లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్'ను ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ కె. హరిత ప్రారంభించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 16 Oct 2026 2:45 PM IST
Kagaznagar
X

Kagaznagar: లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సేవలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే!

కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ (రైలు పట్టాలపై ఆసుపత్రి) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి నవంబర్ 5వ తేదీ వరకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో సేవలు అందించనున్నదని, పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కంటి పరీక్షలు మరియు కంటి ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఆపరేషన్లు, పిల్లలకు సంబంధించిన ఎముకల ఆపరేషన్లు, ప్లాస్టిక్ సర్జరీలు ఉచితంగా నిర్వహించబడతాయని తెలిపారు.

ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ సేవల గురించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని డీఎంహెచ్‌వో సిడం నాగేంద్ర, డీసీహెచ్‌ఎస్ డా. అవినాష్‌లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత, సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, తహసీల్దార్ మల్లెపూల మధుకర్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టీ డా. రోహిణి చౌగులే, పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR