Asifabad: జోడేఘాట్‌లో కొమురం భీమ్‌ 86వ వర్ధంతికి సర్వం సిద్ధం!

Asifabad: జల్‌-జంగల్‌-జమీన్‌ పోరాట యోధుడు కొమురం భీమ్‌ 86వ వర్ధంతికి కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌ సర్వం సిద్ధమైంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 26 Oct 2026 8:46 AM IST
Asifabad
X

Asifabad: జోడేఘాట్‌లో కొమురం భీమ్‌ 86వ వర్ధంతికి సర్వం సిద్ధం!

Asifabad: ఆదివాసీ హక్కుల కోసం పోరాడి, జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదంతో గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పోరాట యోధుడు కొమురం భీమ్‌ 86వ వర్ధంతి కార్యక్రమానికి జోడేఘాట్‌ సిద్ధమైంది. వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్‌లో నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు తరలిరానున్నారు. ఇప్పటికే కొమురం భీమ్‌ కుటుంబ సభ్యులు జోడేఘాట్‌కు చేరుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కార్యక్రమంలో పాల్గొని కొమురం భీమ్‌కు ఘనంగా నివాళులర్పించనున్నారు.

రాష్ట్ర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వర్ధంతి కార్యక్రమానికి హాజరుకానున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్‌ చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన త్యాగాలను స్మరించుకుంటూ జోడేఘాట్‌లో నిర్వహించనున్న 86వ వర్ధంతి కార్యక్రమంలో గిరిజనులు ఘనంగా నివాళులర్పించనున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.