Koutala: కౌటాలలో మాలి సంఘ సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ!
Koutala: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మాలి సంఘ భవనంలో అధ్యక్షుడు ఆదే శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఎస్టీ హోదా సాధన, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
Koutala: కౌటాలలో మాలి సంఘ సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ!
కౌటాల: కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోని మాలి సంఘ భవనంలో మండల మాలి సంఘం అధ్యక్షులు ఆదే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాలి సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని పలువురు మాలి సంఘం నాయకులు హాజరై సంఘ అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మాలి సంఘానికి ఎస్టీ హోదా సాధన కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, సంఘ ఐక్యత, భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదేవిధంగా నవంబర్ 28న మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే అంశంపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదే వసంత్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదే నాందేవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీకోడే గంగారం, మండల ఉపాధ్యక్షులు సెండే నందేవ్, ఆదే బాబురావు, మండల ప్రధాన కార్యదర్శి ఆదే చందు, యువజన అధ్యక్షులు మోర్లె పాండురంగ్, సంఘ నాయకులు సండే సోమయ్య, వశాఖ జ్యోతిరావు, మోర్లె రాము, మోర్లె సంగీత్ రావు, మోర్లె సతీష్, మోర్లె నాగేష్, ఆదే నారాయణ, వెంకటి తదితరులు పాల్గొన్నారు.




