Komaram Bheem: మండల స్థాయిలో ప్రజావాణి ప్రారంభం - వినతుల స్వీకరణ

Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది.

SRINIVAS, KOUTALA
Published on: 17 Aug 2026 7:50 PM IST
Komaram Bheem
X

Komaram Bheem: మండల స్థాయిలో ప్రజావాణి ప్రారంభం - వినతుల స్వీకరణ

కొమురం భీం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపించే లక్ష్యంతో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ బెజ్జూర్ చింతలమానేపల్లి కౌటాల మండలాలలో మండల పరిషత్ కార్యాలయలలో ప్రారంభించారు.

మండలాల ఎంపీడీవో ల ఆద్వర్యంలో జరిగిన తొలిరోజు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు, భూ సమస్యలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

వినతులను సంబంధిత శాఖలకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో లు తెలిపారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటామని అధికారులు తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story