Asifabad: సోమిని ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటన!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమిని ఆశ్రమ పాఠశాలను ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ సందర్శించి విద్యార్థుల సమస్యలు, వసతులపై ఆరా తీశారు.

SRINIVAS, KOUTALA
Published on: 4 Nov 2026 11:25 PM IST
Asifabad
X

Asifabad: సోమిని ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటన!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమిని గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, భోజన వసతులు, తాగునీరు, వసతి గృహ సౌకర్యాలు తదితర అంశాలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని తెలిపారు.

విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి చదువులో రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని *మీఎమ్మెల్సీ దండే విఠల్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు సోముని AHS హెచ్ ఎం పంద్రం బిక్షమయ్య మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA