Asifabad: రుద్రాపూర్‌లో NFBS లబ్ధిదారుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రుద్రాపూర్‌లో NFBS లబ్ధిదారుల వెరిఫికేషన్, హెటిగూడలో 5వ విడత సోషల్ ఆడిట్ గ్రామసభను ఎంపీడీఓ సత్యనారాయణ నిర్వహించారు.
Asifabad: రుద్రాపూర్‌లో NFBS లబ్ధిదారుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్!
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రుద్రాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపిడిఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (NFBS) లబ్ధిదారుల ఇంటింటి వెరిఫికేషన్ నిర్వహించారు. కుటుంబ పెద్ద మరణించిన నిరుపేద కుటుంబాలకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించే ఈ పథకంలో అర్హులైన వారిని గుర్తించి, అనర్హులను తొలగించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
లబ్ధిదారుల ఆధార్, మరణ ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. అనంతరం హెటిగూడ గ్రామ పంచాయతీలో 5వ విడత సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు మండల ఎంపిడిఓ సత్యనారాయణ తో పాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర పథకాల లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించి, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. పథకాల అమలులో పారదర్శకత పాటించాలని, అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.




