Asifabad: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నితిక పంత్!

Asifabad: సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం అక్టోబర్ అంతా అవగాహన మాసోత్సవం హెల్ప్‌లైన్ 1930పై అవగాహన పెంచాలని కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీ నితిక పంత్ పిలుపు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 1 Oct 2026 9:10 PM IST
Asifabad
X

Asifabad: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నితిక పంత్!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: అక్టోబర్‌ నెలను సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో పోలీస్‌ సిబ్బందితో కలిసి ఫ్లాష్‌ మార్చ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు జిల్లాలో ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సైబర్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎవరితోనూ ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు పంచుకోవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దని హెచ్చరించారు.

సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించి ఖాతాను హోల్డ్‌ లేదా ఫ్రీజ్‌ చేయించుకోవాలని తెలిపారు. బాధితులు సకాలంలో 1930కు సమాచారం అందిస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 84 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదైనట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ప్రజలు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకుని, అనుమానాస్పద కాల్స్‌, మెసేజ్‌లు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.