Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు!

Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు దీపాలు వెలిగించారు.

SRINIVAS, KOUTALA
Published on: 24 Nov 2026 10:45 AM IST
Sirpur
X

Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు!

సిర్పూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో బెజ్జూర్ కౌటాల చింతలమానేపల్లి తదితర మండలాలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు హనుమాన్ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. బెజ్జూర్ రంగనాయకస్వామి ఆలయం చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ ఆలయం డబ్బా అభయ ఆంజనేయ స్వామి ఆలయం కౌటాల శివాలయం

తెల్లవారుజామున నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పరమశివుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. శివాలయాలు హనుమాన్ ఆలయాల్లో శివనామ స్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో పలు శైవక్షేత్రాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.

నియోజకవర్గంలోని పలు శైవక్షేత్రాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో దీపాలు వెలిగించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఆలయాలకు చేరుకున్న భక్తులు పరమశివుడిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలోని శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారడంతో సిర్పూర్ నియోజక వర్గంలో ప్రాంతమంతా శివనామ స్మరణతో భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA