Asifabad: కౌటాలలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దహనం!

Asifabad: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 8 Sept 2026 10:01 PM IST
Asifabad
X

Asifabad: కౌటాలలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దహనం!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల వర్షాకాల శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసినట్లు ఆరోపణలు ఉన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కౌటాల మండల కేంద్రంలోని కొమురం భీమ్ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు ని ఎమ్మెల్సీ పదవి నుంచి శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించాలని గౌరవ శాసన మండలి చైర్మన్‌ను నిరసన కార్యక్రమం ద్వారా, అలాగే పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ, దళితుడనే కారణంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై, అలాగే ఆయన దివంగత తల్లిపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు, వీడియోల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన కౌటాల పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ కి ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకి రావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరిగిరాల భాస్కర్ గారు, జిల్లా కార్యదర్శి నైతం సీతల్ గారు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు సంతోష్, శ్రీనివాస్, సూరజ్, అనిల్, పాండురంగ్, బండు, రెడ్డి పెంటన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నిహారిక నాయీమ్ గట్టయ్య యశ్వంత్ రావు కాలీమ్ దుర్గం బండు జ్యోతిరావు , బానేష్ , విలాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story