Koutala: కౌటాల మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా మధునయ్య

Koutala: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా దంద్రే మధునయ్య ఏకగ్రీవ ఎన్నిక. ఉపాధ్యక్షుడిగా రామకృష్ణ ఎంపిక.

SRINIVAS, KOUTALA
Published on: 12 Aug 2026 10:38 PM IST
Koutala
X

Koutala: కౌటాల మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా మధునయ్య

కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు దీపక్ ముండే ఆధ్వర్యంలో కౌటాల మండల ఉప సర్పంచ్‌ల ఫోరం ఎన్నిక నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో కౌటాల మండల ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా దంద్రే మధునయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా అదే రామకృష్ణ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు దంద్రే మధునయ్య మాట్లాడుతూ మండలంలోని ఉప సర్పంచ్‌ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఉప సర్పంచ్‌ల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఉప సర్పంచ్‌లు, నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story