Kaghaznagar: సార్సాల దళిత సర్పంచ్‌పై దాడి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Kaghaznagar: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సార్సాల దళిత సర్పంచ్ కొండగుర్ల ప్రకాష్‌పై పాత కక్షలతో దాడి. నిందితులను కఠినంగా శిక్షించాలని సర్పంచ్‌ల సంఘం డిమాండ్.

LALITH KUMAR, SIRPUR
Published on: 23 Aug 2026 4:07 PM IST
Kaghaznagar
X

Kaghaznagar: సార్సాల దళిత సర్పంచ్‌పై దాడి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కాగజ్ నగర్: కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామానికి చెందిన సర్పంచ్ కొండగుర్ల ప్రకాశ్ పై అదే గ్రామానికి చెందిన వారు నిన్న రాత్రి దాడి చేశారు. వ్యక్తి గత కక్షలు మనసులో పెట్టుకుని చెప్పులతో కర్రలతో దాడి చేశారని సర్పంచ్ కొండగుర్ల ప్రకాష్ వెల్లడించారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈసందర్భంగా సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. దళిత సర్పంచ్ పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. దాడి చేసిన వారిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించకుంటే సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

గత ఎన్నికల్లో ఓటమి పాలై అది జీర్ణించుకోలేకనే సార్సాల గ్రామ సర్పంచ్ ప్రకాష్ పై కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కిరాణా దుకాణం వద్ద ఉన్న సర్పంచ్ పై అకారణంగా వచ్చి దాడి చేసారని తెలిపారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాడి చేయడం తాము కళ్లారా చూశామని తెలిపారు.

ఈవిషయమై పోలీసులను సంప్రదించగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story