Asifabad: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: జేఏసీ!

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె 4వ రోజుకు చేరింది. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఐడీవోసీ నుంచి కేబీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 16 Oct 2026 2:35 PM IST
Asifabad
X

Asifabad: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: జేఏసీ!

కొమురం భీమ్ ఆసిఫాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ NHM జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ నుంచి కేబీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కొమురం భీమ్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న NHM ఉద్యోగులను బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించేలా EHS/ESI సౌకర్యాలు, హెల్త్ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలందించిన తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని NHM జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో NHM ఉద్యోగులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.