Asifabad: ఆసిఫాబాద్‌లో టీఏజీఎస్ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర నాలుగో మహాసభలు మూడు రోజుల పాటు జరగనుండగా, మాజీ ఎంపీ బృందా కారత్ ఆసిఫాబాద్ చేరుకున్నారు.
Asifabad: ఆసిఫాబాద్‌లో టీఏజీఎస్ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం!
ఆసిఫాబాద్: కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర నాలుగో మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. నవంబర్ 27, 28, 29 తేదీల్లో జరగనున్న ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులు, నాయకులు, ప్రజాసంఘాల నేతలు హాజరుకానున్నారు. ఆదివాసీల హక్కులు, భూమి, అటవీ హక్కులు, జీవనోపాధి, విద్య, వైద్యం తదితర సమస్యలపై మహాసభల్లో చర్చించనున్నారు.
మహాసభల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఆసిఫాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ కామ్రేడ్ బృందా కారత్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మీడియం బాబురావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రజాసంఘాల నాయకులు సైతం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
మహాసభల్లో పాల్గొనేందుకు మాజీ ఎంపీ బృందా కారత్ శుక్రవారం రాత్రి ఆసిఫాబాద్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆమె రాకతో మహాసభలకు మరింత ఉత్సాహం నెలకొంది.
ఆదివాసీల హక్కుల పరిరక్షణ, అటవీ హక్కుల చట్టం అమలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలు, భూముల సమస్యలు తదితర అంశాలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నారు. ఆదివాసీల ఐక్యతను చాటుతూ హక్కుల సాధన కోసం భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందించనున్నారు. మూడు రోజులపాటు జరిగే మహాసభలు ఆదివారం ముగియనున్నాయి.




