Asifabad: భూ సమస్యల త్వరిత పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ హరిత!
Asifabad: కొమురం భీం జిల్లా దహేగాంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ హరిత పాల్గొన్నారు. బీద మహిళా రైతు స్లాట్ బుకింగ్ కోసం స్వయంగా రూ.1500 ఇచ్చి ఆదుకున్నారు.
Asifabad: భూ సమస్యల త్వరిత పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ హరిత!
ఆసిఫాబాద్: కొమరం భీం జిల్లాలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. కొమురం భీం జిల్లాలోని దహేగాం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలను అదే రోజు పరిష్కరించడం జరుగుతుంది అని తెలిపారు.
సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు సమర్పించాలని, అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో సమాచారంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు ప్రజాసేతు యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని, యాప్ లో ఇంటి వద్ద నుండి క్యూ ఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి వ్యయ ప్రయాసలకు గురి కావద్దని తెలిపారు.
మండలంలోని హత్తిని గ్రామానికి చెందిన పెద్దల బాణక్క తన భూ సమస్య పరిష్కారానికి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకొని కలెక్టర్ వెంటనే 1 వేయి 500 రూపాయలు మహిళా రైతుకు అందజేయడంతో సదరు మహిళ రైతు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.




