Kyathanpally: రాళ్లు రువ్వుకున్న వేళ.. క్యాతన్‌పల్లిలో మళ్ళీ ఎన్నికల సెగ!
Kyathanpally: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. BRS-CPI కూటమికి మెజారిటీ ఉన్నా, అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
Kyathanpally: రాళ్లు రువ్వుకున్న వేళ.. క్యాతన్‌పల్లిలో మళ్ళీ ఎన్నికల సెగ!
మంచిర్యాల(క్యాతన్‌పల్లి): కాసేపట్లో క్యాతన్‌పల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం బీఆర్ఎస్-సీపీఐ కూటమి, కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో క్యాతన్‌పల్లికి బయల్దేరారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. అటు.. మంత్రి వివేక్‌తో కలిసి కౌన్సిల్ హాల్‌కు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకోనున్నారు. క్యాతన్‌పల్లి మొత్తం వార్డుల సంఖ్య 22 కాగా.. బీఆర్ఎస్-సీపీఐ కూటమి 14, కాంగ్రెస్-7, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్ సాధించినా.. బీఆర్ఎస్కు ఛైర్మన్ పీఠం దక్కకపోవడంతో.. గతంలో తీవ్ర వివాదం చెలరేగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణలు జరగగా.. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు కార్యకర్తలు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు మరోసారి క్యాతన్‌పల్లి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. గత ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




