Kyathanpally Municipality: బాల్క సుమన్ వ్యూహం సక్సెస్.. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌గా సంధ్యారాణి!

Kyathanpally Municipality: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ విజయం. సీపీఐ మద్దతుతో చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకున్న గొడిశెల సంధ్యారాణి. కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన బాల్క సుమన్ వ్యూహం.

Arun Chilukuri
Published on: 4 April 2026 12:24 PM IST
Kyathanpally Municipality
X

Kyathanpally Municipality: బాల్క సుమన్ వ్యూహం సక్సెస్.. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్‌గా సంధ్యారాణి!

Kyathanpally Municipality Election Results: మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు అనూహ్య మలుపు తిరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ, బీఆర్ఎస్ తన పంతం నెగ్గించుకుంది. తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.

బాల్క సుమన్ వ్యూహం ఫలిించింది:

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యూహాత్మక అడుగులతో క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 10 స్థానాలు ఉండగా, సీపీఐకి చెందిన నలుగురు కౌన్సిలర్లు మద్దతు పలికారు. దీంతో స్పష్టమైన మెజారిటీ సాధించిన ఈ కూటమి.. కాంగ్రెస్‌ను నిలువరించడంలో విజయవంతమైంది. మరోవైపు, సమీకరణాలు అనుకూలంగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండిపోయింది.

పొత్తు ధర్మంలో భాగంగా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను ఇద్దరు మహిళా కౌన్సిలర్లు వరించాయి. మున్సిపల్ చైర్ పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ చైర్ పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తానికి రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీ అధికార పీఠాన్ని బీఆర్ఎస్-సీపీఐ జంట దక్కించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story