Asifabad: కొమురం భీం జిల్లాలో రోడ్డుపై బైఠాయించి కాలనీవాసుల నిరసన!
Asifabad: పెంచికల్పేట మండలం బొంబాయిగూడాలో వర్షపు నీరు, బురద నిలవడంతో రోడ్డుపై బైఠాయించి కాలనీవాసులు నిరసన; అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.
Asifabad: కొమురం భీం జిల్లాలో రోడ్డుపై బైఠాయించి కాలనీవాసుల నిరసన!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని బొంబాయిగూడా గ్రామంలో రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో నాగపురి వాడలో కాలనీవాసులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని, రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.
తమ కాలనీల్లో రోడ్లపై పేరుకుపోయిన బురద నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Next Story




