Chennur: చెన్నూరులో అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలు!

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో శ్రావణ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది.

RAJENDER, CHENNUR
Published on: 6 Sept 2026 10:38 PM IST
Chennur
X

Chennur: చెన్నూరులో అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలు!

చెన్నూరు: చెన్నూరు పట్టణంలో మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

డప్పు చప్పుల్లు, శివశక్తుల నృత్యాలు, పోతరాజు ల విన్యాసలు, మహిళలు బోనాలతో మహంకాళి బోనాల ఉత్సవంతొ ఊరంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన పూజారి మహంకాళి అమ్మవారిని శిరస్సు పై ధరించి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద ప్రారంభం అయి మహంకాళి తల్లి ఆలయం వరకు కొనసాగించారు.

ప్రతి ఏటా శ్రావణ మాసంలోని చివరి ఆదివారం రోజున మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం, ఉత్సవాలు జరపడం, జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని, బోనాలు సమర్పించు, ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

ఇందులో భాగంగా శివశక్తులూ బోనాలతో అమ్మవారి రూపంలో ఊరేగింపు చేయగా, పోత రాజుల వేషధారణలో అమ్మవారి ముందు పట్నాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరు వాడ చల్లగా ఉంచమని, భక్తులు కోరుకుంటూ, బోనాలతో తమ మొక్కలను సమర్పించుకున్నారు. ఈ మహంకాళి బోనాల ఉత్సవాల్లో స్థానిక భక్తులు, ప్రజలే కాకుండా చుట్టుప్రక్క గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story