Kagaznagar: దండారి ఉత్సవాల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. ఆదిత!
Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా జరిగిన దండారి ఉత్సవాల్లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. ఆదిత పాల్గొని, పెద్దమాలినిలో పల్లె నిద్ర చేశారు.
Kagaznagar: దండారి ఉత్సవాల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. ఆదిత!
Kagaznagar: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని మేడిపల్లి, పెద్దమాలిని, చిన్నమాలిని గ్రామాలతో పాటు సిర్పూర్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాలు, సంబరాల కార్యక్రమాల్లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రీమతి బి. ఆదిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే దండారి వేడుకల్లో పాల్గొని గ్రామస్తులతో కలిసి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్యరావు, అనిత భాయ్, డోబి పటేల్, కొర్రం మారుతి, ఓదెలు, నగేష్, గోపాల్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
అనంతరం పెద్దమాలిని గ్రామంలో బి. ఆదిత పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు, గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.




