Mancherial: మంచిర్యాల ప్రజావాణికి 63 అర్జీలు.. త్వరగా పరిష్కరించాలి

Mancherial: మంచిర్యాల నస్పూర్ కలెక్టరేట్‌లో ప్రజావాణికి 63 దరఖాస్తులు; క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 23 Nov 2026 9:47 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల ప్రజావాణికి 63 అర్జీలు.. త్వరగా పరిష్కరించాలి

మంచిర్యాల: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హుల సమస్యలను త్వరగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 63 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

వారసత్వ భూముల వివాదాలు, అక్రమ పట్టాల రద్దు, చెరువు నాలాల ఆక్రమణలు, ఇంటి ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు, మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్లు, గీత కార్మికుల పింఛన్లు, రేషన్ కార్డుల సమస్యలు, భూ క్రయవిక్రయాల నిలుపుదల, గ్రామపంచాయతీ భవన నిర్మాణం వంటి అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.