Bellampalli: బెల్లంపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా 2కే రన్!
Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా 2కే రన్.
Bellampalli: బెల్లంపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా 2కే రన్!
Bellampalli: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పోలీసులు 2కే రన్ నిర్వహించారు.
బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుంచి కాంటా చౌరస్తా వరకు నిర్వహించిన 2కే ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ,
మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజ భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతుందని అన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story




