Mancherial: భీమిని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు!

Mancherial: భీమిని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. సాదాబైనామా పట్టా కోసం రూ. 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీవో దుర్గాప్రసాద్, సహకరించిన వ్యాపారి అరెస్ట్.

PRATHAP, BELLAMPALLI
Published on: 22 Sept 2026 5:50 PM IST
Mancherial
X

Mancherial: భీమిని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని పెద్దాపేట గ్రామానికి చెందిన రైతు ఫకీర్ భూమిని సాదాబైనామా భూమిని పట్టాగా మార్చేందుకు గాను, స్థానిక జీపీవో దుర్గాప్రసాద్ మొదట రూ. 1,80,000 డిమాండ్ చేసి, చివరకు రూ. 1,30,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఇవాళ బాధితుడి నుంచి రూ. 80,000 లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ జి. మధు ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దుర్గాప్రసాద్‌తో పాటు ఆన్‌లైన్ లావాదేవీలకు సహకరిస్తున్న కిరాణా షాప్ నిర్వాహకుడు పోతు రాజేందర్‌ను కూడా అదుపులోకి తీసుకొని, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా ఏసీబీ డీఎస్పీ (9154388963) నంబర్‌కు సంప్రదించాలని కోరారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI