Chennur: జాతీయ వాలీబాల్‌లో చెన్నూరు యువకుడి ప్రతిభ

Chennur: హర్యానాలో జరిగిన జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ తరఫున రజత పతకం సాధించి ప్రతిభ చాటాడు మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన తోడే అశ్విత్ రెడ్డి.

RAJENDER, CHENNUR
Updated on: 26 Oct 2026 7:16 PM IST
Chennur
X

Chennur: జాతీయ వాలీబాల్‌లో చెన్నూరు యువకుడి ప్రతిభ

మంచిర్యాల జిల్లా: చెన్నూరు పట్టణానికి చెందిన యువకుడు జాతీయ స్థాయి క్రీడల్లో తన సత్తా చాటాడు. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలో ప్రతిభ చాటడంతో దీంతో జాతీయ స్థాయి క్రీడల్లో అవకాశం లభించగా జాతీయ స్థాయిలో కూడా తన సత్తాను చూపాడు.

హర్యానాలో జరిగిన జాతీయ జూనియర్ లెవెల్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం సెకండ్ ప్లేస్ లో నిలిచింది జాతీయ స్థాయి జూనియర్ లెవెల్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ స్టేట్ సెకండ్ ప్లేస్ సాధించడం చాలా సంతోషంగా ఉందని అందులో తమ కొడుకు అశ్విత్ రెడ్డి ఉండడం మరింత సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రస్థాయిలో జరిగిన జూనియర్ లెవెల్ వాలీబాల్ క్రీడా పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించగా, ప్రస్తుతం జాతీయ స్థాయి జూనియర్ లెవెల్ వాలీబాల్ పోటీల్లో సెకండ్ ప్రైస్, సిల్వర్ మెడల్ ను గెల్చుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన యువకుడు తోడే అశ్విత్ రెడ్డి 14 సంవత్సరాల యువకుడు జాతీయస్థాయి క్రీడలో రాణించడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యువకుడు హనుమకొండలోని ఎస్ ఆర్ ప్రైమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటూ క్రీడల్లో పట్టు సాధిస్తూ పథకాలు సాధిస్తున్నాడు.

రాష్ట్ర ప్రభుత్వం తనకు మరింత సహకారం అందించి ప్రోత్సహిస్తే జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో మరిన్ని పథకాలను సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR