Mancherial: గూడెం నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన మంచిర్యాల కలెక్టర్!
Mancherial: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్. ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆదేశం.
Mancherial: గూడెం నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన మంచిర్యాల కలెక్టర్!
Mancherial: మంచిర్యాల జిల్లా వినాయక నవరాత్రుల అనంతరం నిర్వహించే నిమజ్జన కార్యక్రమాన్ని సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
బుధవారం దండేపల్లి మండలం గూడెంలోని నిమజ్జన ప్రాంతాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, ఎస్ఐలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
నిమజ్జన ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.




