Mancherial: బియ్యం ధరల నియంత్రణకు చర్యలు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

Mancherial: జైపూర్‌లో సబ్సిడీ బియ్యం అవుట్‌లెట్‌ను ప్రారంభించిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, ఉల్లంఘిస్తే చర్యలని హెచ్చరిక.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 5 Nov 2026 7:07 PM IST
Mancherial
X

Mancherial: బియ్యం ధరల నియంత్రణకు చర్యలు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జైపూర్ మండల కేంద్రంలో సమత రైస్ డిపో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.

ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయించాలని సూచించారు.

అవుట్‌లెట్‌లో బియ్యం ధరలు ఇలా.. 26 కిలోల బీపీటీ కొత్త బియ్యం బస్తా రూ.1,352స్టీమ్ రైస్ బస్తా రూ.1,482పాత బియ్యం బస్తా రూ.1,638హెచ్‌ఎంటీ పాత బియ్యం బస్తా రూ.1,950జైశ్రీరామ్ పాత బియ్యం బస్తా రూ.1,976

బియ్యం విక్రయాలపై నిఘా కోసం రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తనిఖీలకు వ్యాపారులు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.