Mancherial: భూముల రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ కుమార్ దీపక్
Mancherial: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశం. సర్వేయర్లకు 12 జీఎన్‌ఎస్‌ఎస్ రోవర్ల అందజేత, రైతులకు ముందస్తు సమాచారం.
Mancherial: భూముల రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో సర్వేయర్లకు 12 జీఎన్ఎస్ఎస్ రోవర్లను అదనపు కలెక్టర్ వి.రాములుతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. టామ్‌టామ్ ద్వారా ప్రచారం నిర్వహించి ప్రతి రైతు సర్వే సమయంలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూముల రీ సర్వే ద్వారా భవిష్యత్తులో భూ సమస్యలకు అవకాశం లేకుండా చేయవచ్చని తెలిపారు.
ఖచ్చితమైన కొలతల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 12 రోవర్లను అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.




