Bellampalli: ఎండ తీవ్రత నేపథ్యంలో పోలీసుల సేవా కార్యక్రమం

Bellampalli: మంచిర్యాల డీసీపీ భాస్కర్ బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఫ్లైఓవర్‌పై పోలీస్ చలివేంద్రాన్ని ప్రారంభించారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 25 April 2026 4:32 PM IST
Bellampalli
X

Bellampalli: ఎండ తీవ్రత నేపథ్యంలో పోలీసుల సేవా కార్యక్రమం

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి కాల్ టెక్స్ ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ఎండ తీవ్రతలో ప్రయాణించే ప్రజలు, కార్మికులు,

వాహనదారులు దాహార్తిని తీర్చుకునేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కూడా పోలీసుల బాధ్యతేనని పేర్కొన్నారు. వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత అవసరమని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story