Mancherial: మంచిర్యాలకు కొత్త ఐపీఎస్ అధికారి కావాలి: బీఆర్ఎస్!

Mancherial: మంచిర్యాలలో పెరుగుతున్న దాడులు, శాంతిభద్రతల సమస్యలను అరికట్టేందుకు కొత్త ఐపీఎస్ అధికారిని నియమించాలని డీజీపీకి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, దివాకర్ రావు వినతిపత్రం ఇచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 9:24 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలకు కొత్త ఐపీఎస్ అధికారి కావాలి: బీఆర్ఎస్!

మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో ఇటీవల చోటుచేసుకుంటున్న దాడులు, గొడవలు, శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోలీస్ శాఖకు పలు డిమాండ్లు ముందుంచింది. పట్టణంలో నేరాలను అదుపు చేసి ప్రజలకు భద్రత కల్పించాలంటే మంచిర్యాలకు కొత్త ఐపీఎస్ అధికారిని నియమించాలని కోరారు..

ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.

మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంటున్న వరుస దాడులు, ఘర్షణలతో ప్రజల్లో ఆందోళన నెలకొందని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు

మంచిర్యాలకు కొత్త ఐపీఎస్ అధికారిని నియమించి శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.