Mancherial: మంచిర్యాలలో విజయదశమి సంబరాలు పాల్గొన్న మంథని జగన్మోహన్ రావు

Mancherial: మంచిర్యాల జిల్లాలో విజయదశమి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు మంథని జగన్మోహన్ రావు. జమ్మి పూజ, శ్రీరాంపూర్‌లో రావణ దహనంలో భాగస్వామ్యం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 20 Oct 2026 11:33 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో విజయదశమి సంబరాలు పాల్గొన్న మంథని జగన్మోహన్ రావు

మంచిర్యాల జిల్లా: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంథని జగన్మోహన్ రావు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

అనంతరం మంచిర్యాలలో నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమంలో, శ్రీరాంపూర్ కాలనీలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంథని జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. దుర్గామాత కృపాకటాక్షాలు మంచిర్యాల జిల్లా ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని పేర్కొన్నారు.

పండుగల సందర్భంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.