Mancherial: డీజీపీ సి.వి. ఆనంద్‌తో మంథన జగన్ భేటీ

Mancherial: మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంథన జగన్ మోహన్ రావు డీజీపీ సి.వి. ఆనంద్‌ను కలిసి తాళ్లపేట, దసరా నాటి ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 25 Oct 2026 8:28 PM IST
Mancherial
X

Mancherial: డీజీపీ సి.వి. ఆనంద్‌తో మంథన జగన్ భేటీ

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంథన జగన్ మోహన్ రావు తన బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సమయంలో చోటుచేసుకున్న పలు సంఘటనలతో పాటు తాళ్లపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

పండుగల సందర్భంగా జరిగిన సంఘటనల నేపథ్యం, స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, తాళ్లపేట ఘటనకు సంబంధించిన అంశాలను ఆయన డీజీపీకి వివరించినట్లు సమాచారం. ఆయా ఘటనల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సంబంధిత అంశాలపై దృష్టి సారించాలని కోరినట్లు తెలిసింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.