Mancherial: దొనబండలో ఇందిరమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Mancherial: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండలో రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించి చీరలు అందజేశారు.
Mancherial: దొనబండలో ఇందిరమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు.
హాజీపూర్ మండలం దొనబండ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీఓ కిషన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించడంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందేందుకు ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలుస్తోందని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో హాజీపూర్ ఎంపీఓ మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం దొనబండలో రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ.. మహిళలకు చీరలు అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.




