Mancherial: చెన్నూరులో కమ్యూనిటీ కాంటాక్ట్.. వాహనాలు సీజ్
Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తుర్కపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్. సరైన పత్రాలు లేని 20 బైకులు, 2 ఆటోలు సీజ్.
Mancherial: చెన్నూరులో కమ్యూనిటీ కాంటాక్ట్.. వాహనాలు సీజ్
మంచిర్యాల: చెన్నూరు మండలంలోని తుర్కపల్లి గ్రామంలో చెన్నూర్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 20 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు సీజ్ పోలీసులు సీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్ గ్రామస్థులకు అవగాహనా కల్పిస్తూ గుడుంబా ను నిర్ములించడానికి గ్రామంలోని ప్రతి ఒక్కరు తీర్మానించుకొని గుడుంబానీ అరికట్టుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని, మాదక ద్రవ్యాలకు బానిసై విలువైన జీవితం పాడుచేసుకోవద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించరాదని తెలియజేశారు.
గంజాయి, మద్యం సేవించి రాత్రి సమయాలలో సంచరించేవారి సమాచారం తెలియజేయాలనీ ప్రజలను కోరారు. అదేవిదంగా క్షనీకావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏ సమస్య కు అయిన ఒక పరిష్కారం ఉంటుందని ఆదిశగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ ఐ శ్యామ్ పటేల్, స్పెషల్ పోలీస్ మరియు చెన్నూర్ పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




