Mancherial: ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల బృందం ప్రతిభ!

Mancherial: గుజరాత్ ఏక్తా నగర్‌లో జరిగిన ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల జిల్లా నుంచి 13 మంది పాల్గొన్నారు. బృంద సభ్యులను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేకంగా అభినందించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 10:58 PM IST
Mancherial
X

Mancherial: ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల బృందం ప్రతిభ!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ప్రతినిధులు గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో నిర్వహించిన ఏక్తా దివస్ పరేడ్‌లో పాల్గొని జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి 5 మంది పెద్దలు, 8 మంది విద్యార్థులు కలిపి మొత్తం 13 మంది పాల్గొన్నారు. జాతీయ స్థాయి కార్యక్రమంలో తెలంగాణ నుంచి 400 మంది హాజరయ్యారు.

సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బృంద సభ్యులు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ పరిపాలన అధికారి, జిల్లా నోడల్ అధికారి దేశ్‌పాండే శ్రీనివాసరావు నేతృత్వంలో రైతులు, వ్యాపారవేత్తలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ భావం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆశయాల గురించి తెలుసుకోవడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.